- రూ.80 వేల జరిమానా కూడా
- జనగామ జిల్లా కోర్టు తీర్పు
జనగామ అర్బన్, వెలుగు : బాలికపై అత్యాచారం కేసులో జనగామ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జనగామ సీఐ శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం జనగామ మండలం చీటకోడూర్ గ్రామానికి చెందిన బొట్ల ప్రసాద్ (35) జనగామ–సూర్యాపేట రోడ్డులో 2019లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. జనగామకు చెందిన బాలికకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆమెకు నయంచేసి పెళ్లి చేసుకుంటానని, తన దగ్గర రిసెప్షనిస్టుగా పెట్టుకుంటానని ప్రసాద్ మాయమాటలు చెప్పాడు. బాలికను శారీకంగా వాడుకొని గర్భిణిని చేసి వదిలేశాడు. అప్పటికే ప్రసాద్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మోసపోయిన బాలిక.. జనగామ పోలీస్ స్టేషన్లో 2019లో ఫిర్యాదు చేసింది. శుక్రవారం కేసు విచారణకు రాగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ.. నిందితుడికి పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.80 వేల జరిమానా కూడా విధించారు.