ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మకంచ బాలికల పాఠశాలలో (పీఎస్ నెం: 263)ని పోలింగ్ బూత్నకు యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలింగ్సరళిని పరిశీలించడానికి వెళ్లారు. దీంతో ఆ బూత్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజంట్ ప్రవీణ్..... ప్రశాంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్శర్ రెడ్డి అక్కడకు చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఏసీపీ అంకిత్ ఆదేశాలతో సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.