బీఆర్‌‌ఎస్ పాలనలో యువతకు దక్కింది శూన్యం

బీఆర్‌‌ఎస్ పాలనలో యువతకు దక్కింది శూన్యం
  • జనగామ జిల్లా కాంగ్రెస్ ​అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనలో యువతకు దక్కింది శూన్యమని జనగామ జల్లా కాంగ్రెస్​అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి విమర్శించారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు, బండనాగారం, లక్ష్మాపూర్​, ఆలింపూర్​, బోనకొళ్ళూరు, కేశిరెడ్డిపల్లి, పోచన్నపేట, బసిరెడ్డి గ్రామాలు, బచ్చన్నపేట మండల కేంద్రంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత వెంకటచారితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భగా మీడియాతో ఆయన మాట్లాడారు.   కేటీఆర్, హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  బీఆర్‌‌ఎస్ పాలనలో వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ ఎత్తివేసి ఇబ్బందులకు గురిచేసిందన్నారు.  కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాల నియామకంపై దృష్టిపెట్టిందని చెప్పారు.  పీఏసీఎస్​ చైర్మన్ పూర్ణ చందర్,  ఐకేపీ ఏపీఎం నాగేశ్వరరావు,​మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు నూకల బాల్​రెడ్డి, జిల్లా నాయకుడు జంగిటి విధ్యానాథ్​, టౌన్​అధ్యక్షుడు మాత్మచారీ, ఐకేపీ సీసీలు, పొదుపు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.