సీఎం కేసీఆర్​ పునరాలోచన చేయాలి : శ్రీరాములు

చేర్యాల, వెలుగు : జనగామ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లేకుండా పోతుందని,  బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, టికెట్​ విషయంలో సీఎం కేసీఆర్​ పునరాలోచన చేయాలని  బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు, మాజీ ఆఫ్కో చైర్మన్​ మండల శ్రీరాములు అన్నారు. గురువారం మండలంలోని ఆకునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ALSO READ : ఎన్ని స్కీమ్లు వదిలినా కేసీఆర్ను ప్రజలు నమ్మరు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జనగామ బీఆర్​ఎస్​ టికెట్​ బీసీ బిడ్డనైన తనకే ఇవ్వాలని కోరారు. త్వరలోనే భారీ ఎత్తున 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్​ఎస్​ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.