జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని గాయత్రీ గార్డెన్లో మీడియాతో మాట్లాడారు. జనగామ నియోజకవర్గం తపాస్ పల్లి నుంచి దొడ్డి దారిన సిద్ధిపేటకు నీళ్లు తీసుకెళ్తున్నారని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దీనికి అడ్డుకట్ట వేస్తానని అన్నారు.
జనగామ ప్రెస్టన్ గ్రౌండ్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విజయభేరి సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభకు లక్ష మంది జనాలు హాజరుకానున్నట్లు తెలిపారు. అంతకుముందు సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మాజీ మార్కెట్, మున్సిపల్ చైర్మన్లు ఎర్రమల్ల సుధాకర్, వేమల్ల సత్యనారాయణ రెడ్డి, లీడర్లు సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్ పాల్గొన్నారు.