బీఆర్‌‌ఎస్‌‌తోనే అభివృద్ధి : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌తోనే అభివృద్ధి సాధ్యమని జనగామ ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి చెప్పారు. శుక్రవారం జనగామలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పలువురు వ్యాపారులను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పోకల జమున, బండ యాదగిరిరెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మేకపోతుల ఆంజనేయులు, ఉల్లెంగుల సందీప్, ధర్మపురి శ్రీనివాస్‌‌ పాల్గొన్నారు.