లిఫ్ట్​ స్కీమ్​లతో రైతులకు మేలు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి

లిఫ్ట్​ స్కీమ్​లతో రైతులకు మేలు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి

జనగామ, వెలుగు : సాగునీటి లిఫ్ట్​ స్కీమ్​లతో చెరువుల్లోకి నీరు సమృద్ధిగా చేరి రైతులకు మేలు జరుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తరిగొప్పుల మండలంలోని గండి రామారంలో లిఫ్ట్​ పున:నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరిగొప్పుల మండలంలోని 52 చెరువులకు నీరందించే లక్ష్యంతో తలపెట్టిన లిఫ్ట్​ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ పనులు పూర్తైతే నీటి ఇక్కట్లు ఉండవన్నారు. కార్యక్రమంలో జనగామ మున్సిపల్​చైర్​పర్సన్​పోకల జమునలింగయ్య తదితరులు పాల్గొన్నారు.