ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కాంప్లెక్స్​వద్ద ఇందిరమ్మ మోడల్​హౌజ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్​ పులిగిళ్ల పూర్ణచందర్, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు బాల్​రెడ్డి, రైతుబంధు జిల్లా మాజీ కన్వీనర్​ రమణారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.