
జనగామ అర్బన్, వెలుగు: జనగామ టౌన్ లో 10 రోజుల కింద కిడ్నాప్ అయిన చిన్నారి శివాని(10 నెలలు) కేసును జనగామ పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళవారం జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ పండరీ చేతన్ నితిన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. చత్తీస్గడ్ కు చెందిన రాంజిల్ రజాక్, పార్వతి దంపతులు జనగామలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.
వీరి కూతురు శివానిని అక్కడే పని చేస్తున్న సురేశ్, విజయలక్ష్మి దంపతులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజ్ ల ఆధారంగా నిందితులను పెంబర్తి వద్ద పట్టుకున్నారు. విజయవాడకు చెందిన చంద్రమ్మ, గుంటూరుకు చెందిన తిరుపతమ్మ ద్వారాపిల్లలు లేని వారికి పాపను అమ్మేందుకు కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు.