బీజేపీ, కాంగ్రెస్​ కుట్రలో జానయ్య ఇరుక్కున్నారు

సూర్యాపేట, వెలుగు : యాదవుల ఆరాధ్యదైవమైన పెద్దగట్టు లింగమంతుల స్వరూపం మంత్రి జగదీశ్  రెడ్డి అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌  అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి యాదవ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ ను ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్  చైర్మన్ గా మంత్రి జగదీశ్ రెడ్డి నియమించారన్నారు. తనకు ప్రాణహాని ఉందన్న సమయంలో సైతం మంత్రి గన్​మెన్​ను ఇచ్చారని గుర్తుచేశారు. 

బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో జానయ్య యాదవ్ ఇరుక్కున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని లింగయ్య అన్నారు. పెద్దగట్టు చైర్మన్  కోడి సైదులు యాదవ్, దావుల వీరప్రసాద్ యాదవ్, మన్నే లక్ష్మీనరసయ్య యాదవ్  తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.