గ్రాండ్​గా వట్టే జానయ్య యాదవ్ బర్త్​డే

సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన  నివాసంలో 13వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక, జానయ్య తల్లి ఐలమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వట్టే రేణుక మాట్లాడుతూ ప్రజల మనిషి వట్టే జానయ్య యాదవ్ అని,  ప్రజలకు ఏ ఆపద వచ్చినా పరిష్కరించడంలో ముందుంటారని తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వట్టే జానయ్య యాదవ్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. జానయ్య పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చాంద్ పాషా, వల్లాల సైదులు, కుంభం వెంకన్న యాదవ్, ఆవుల అంజయ్య యాదవ్, అమృనాయక్, జానకీరాములు, ఆసిఫ్, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.