అవినీతిలో కూరుకుపోయిన టీబీజీకేఎస్ లీడర్లు : జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: సింగరేణిలో టీబీజీకేఎస్ యూనియన్ లీడర్లు అవినీతిలో కూరుకుపోయి కార్మిక సమస్యలు పట్టించుకోలేదని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ3, 5 గనుల్లో పనిచేసే కార్మికులు ఐఎన్టీయుసీ యూనియన్ లో చేరగా వారికి యూనియన్ కండువా కప్పి మాట్లాడారు. సింగరేణి సంస్థను పరిరక్షించాలన్నా, కార్మిక హక్కులు కాపాడాలన్నా ఐఎన్టీయూసీతోనే సాధ్యమన్నారు.

యాజమాన్య తొత్తు సంఘం టీబీజీకేఎస్ నాయకులు అవినీతిలో కూరుకుపోయి కార్మిక సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యాన్ని అడ్డుకుంటామని, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, కార్మికుల సొంతింటి కల, రిటైర్మెంట్ తీసుకున్న రోజే అన్ని బెనిఫిట్స్ అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

త్వరలోనే ఐఎన్టీయూసీ సింగరేణి మ్యానిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్ల శంకర్​రావు, కాంపెల్లి సమ్మయ్య, కళవేణ శ్యామ్, గరిగె స్వామి, తిరుపతి రాజు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.