సింగరేణికి రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కృషి : జనక్ ప్రసాద్

గోదావరిఖని,వెలుగు: ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇప్పించేందుకు ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఆ యూనియన్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆరు ఏరియాల్లో ఓట్లు వేసి గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలుతెలిపారు.

 వెయ్యి ఓట్లతో ప్రాతినిధ్య సంఘంగా ఓడిపోవడానికి గల కారణాలపై సమీక్ష చేసుకుంటామన్నారు. కార్మికులకు, కార్యకర్తలకు ఐఎన్టీయూసీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, ధర్మపురి, ఆర్జీ వన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం పాల్గొన్నారు.