జానకీపురం సత్తెమ్మ ఆలయంలో  దొంగతనానికి యత్నం

అన్నపురెడ్డిపల్లి,వెలుగు:   మండలంలోని జానకీపురం సత్తెమ్మతల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు  చోరీకి యత్నించారు. ఆలయ తలుపులు పగుల గొట్టి, సీసీ  కెమెరాలను ధ్వంసం చేసి, హుండీని పగుల గొట్టారు.

హుండీలో డబ్బులు లేకపోవడంతో..  సీసీ  కెమెరాలను, మోనిటర్ ను ఎత్తుకెళ్ళారు.  ఆలయంలోని రూ.25వేల విలువ చేసే వస్తువులను  ధ్వంసం చేశారని  ఆలయ కమిఈ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్టు ఎస్సై షహీనా  తెలిపారు.