- కొండేటి మల్లయ్య టికెట్ ఆశలు గల్లంతు
- గత మూడు టర్మ్‌ల నుంచి సేమ్ సీన్ రిపీట్
నల్గొండ, వెలుగు: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ సీనియర్‌నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు కొండేటి మల్లయ్యకు గట్టిషాక్ తగిలింది. గత మూడు టర్మ్‌ల నుంచి నకిరేకల్సీటు కోసం ఫైట్చేస్తున్న మల్లయ్య ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తనకు టికెట్వస్తదని ఆశతో ఉన్నారు. ఇటు జానారెడ్డి, అటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆశీస్సులు ఉండటంతో మల్లయ్యకు ఈ దఫా తిరుగు ఉండదనే భావించారు. ఆ మేరకు పార్టీ సభ్యత్వ నమోదుతో సహా, పార్టీ హైకమాండ్పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన సక్సెస్‌చేశారు.
రేవంత్అండతోనే మల్లయ్య పీసీసీ కమిటీలో చోటు కూడా దక్కింది. కానీ వీరేశం పార్టీలో చేరేందుకు లైన్క్లియర్అయిందని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి మల్లయ్య తన టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. దామోదర రాజనర్సింహా, జానా రెడ్డితో సహా ఏఐసీసీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్వస్తదనే అనుకున్నారు. అయితే వీరేశం రాకను మొదట్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వ్యతిరేకించారు. కానీ అధిష్టానం ఆదేశాలతో కోమటిరెడ్డి సైతం దిగరాక తప్పలేదు. మల్లయ్యను ప్రోత్సహించిన రేవంత్స్వయంగా వీరేశాన్ని వెంటపెట్టుకుని పార్టీ హైకమాండ్ వరకు తీసుకెళ్లారు.
ఈ పరిణామాలతో షాక్ తిన్న మల్లయ్య అయోమయంలో పడ్డారు. ఇప్పటికే టికెట్వస్తదన్న నమ్మకంతో నకిరేకల్‌లో భారీగా ఖర్చు పెట్టారు. ఈయనతోపాటు మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య కొడుకు శ్రీధర్, ప్రసన్నరాజ్, దైదా రవీందర్‌లు కూడా రేసులో ఉన్నారు. వీరంతా కోమటి రెడ్డి మీద నమ్మకం పెట్టుకున్నారు. కానీ చివరకు పార్టీ ఆదేశాల మేరకు సీనియర్లు, ఆశావహులు తలొంచాల్సి వచ్చింది. ఇప్పటికైతే కోమటిరెడ్డి వర్గం సైలెంట్‌గా ఉన్నప్పటికీ, మల్లయ్య మాత్రం త్వరలో తన భవిష్యత్తు రాజకీయ కార్యచరణ ప్రకటించే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. శుక్ర వారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నకిరేకల్‌కు ఆహ్వానించి ఎన్నికల ప్రచారానికి వీరేశం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఆశావహులు ఎవరూ రాకపోవడం గమనార్హం.