ఎంత మంది పోయినా బాధలేదు : జానారెడ్డి

పెరుగుట విరుగట కొరకే

పరిస్థితులు మారేరోజు వస్తుంది

ప్రభుత్వం పడిపోయే రోజులు రావొచ్చు

మీడియాతో జానారెడ్డి చిట్ చాట్

గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి భారీగా పెరిగిన వలసలపై ఆయన స్పందించారు. ఒకరిద్దరు పోతే వార్త కానీ.. అందరూ వరుసగాపోతుంటే వార్త ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు. పెరుగుట విరుగుట కొరకే అన్నారు.

పార్టీలు, వ్యక్తులు కిందకు మీదకు అవ్వడం సాధారణ పరిణామమే అన్నారు జానారెడ్డి. మానసిక ప్రశాంతత ఉఁటే పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా భవిష్యత్తుపై నమ్మకం ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు రిపేర్ చేయడం కాదు.. ఏకంగా తలకిందులయ్యే రోజులు వస్తాయని ఆయన నమ్మకంగా చెప్పారు.

“డైరెక్టుగా గాలిలో తేలే వాహనం తయారు చేస్తాం. చూస్తూ ఉండండి. అది పుష్పక విమానమా? మరొకటా ఏదో ఒకటి సిద్ధం చేస్తాం. ఎంత మంది పోతే ఏంది… ఇంకా ఉన్న వాళ్లు పోయినా పోయేదేంటి.. పార్టీలు, వ్యక్తులు క్రిందకు మీదకవ్వటం సాధారణ పరిణామమే. ప్రతిపక్షం లేకుండా చేస్తామన్నప్పుడు వార్త రాసినవాళ్లు… ప్రభుత్వమే లేకుండా పోయే రోజులు రావొచ్చు అన్న విశ్లేషణ కూడా చేయాలి” అని అన్నారు జానారెడ్డి.