ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి పేరుతో ప్రచారానికి సన్నద్ధం అయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్టణం ఎంపీ స్థానానికి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించాడు పవన్ కళ్యాణ్.వైసీపీ నుండి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరికి మచిలీపట్టణం ఎంపీ టికెట్ కేటాయించినట్లు ప్రకటించింది జనసేన. బాలశౌరికి మచిలీపట్టణం టికెట్ కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు అధికారిక ప్రకటనతో బాలశౌరికి టికెట్ ఖరారయ్యింది.

కాకినాడ ఎంపీ స్థానానికి టీటైమ్ వ్యవస్థాపకుడు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కేటాయించగా ఇప్పుడు రెండో ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పొత్తులో భాగంగా 21అసెంబ్లీ స్థానాలు 2ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ స్థానానికి ఆశావహులు ఎక్కువమంది ఉన్న నేపథ్యంలో సర్వే జరిపిన తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది.