LB స్టేడియంలో ఏప్రిల్ 4న జనసేన-BSP బహిరంగ సభ

ఎన్నికలకు మరో పదకొండు రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హారెత్తిస్తున్నాయి. హైదరాబాద్ LB స్టేడియంలో ఇటీవలే టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. ఇవాళ ప్రధాని మోడీ సభ జరగనుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన కూడా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరం సభకు ప్లాన్ చేస్తోంది.

మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. BSP, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది పవన్ కల్యాణ్ సేన. ఏప్రిల్ 4 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించాయి.

ఈ పబ్లిక్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా BSP అధినేత్రి, UP మాజీ ముఖ్యమంత్రి మాయవతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఇతర మిత్రపక్షాల నాయులు హాజరు కానున్నారు.