జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా.. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. నేతలంతా ర్యాలీలతో వెళ్లి నామినేషన్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నామినేషన్ పాత్రల్లో అభ్యర్థులంతా తమపై ఉన్న కేసులతో పాటు ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తుండటంతో  సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నెలిమర్ల నుండి పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. 

Also Read:వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

లోకం మాధవి ఆస్తుల విలువ 894.92 కోట్లు కాగా, వీటిలో మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్‌ పలు రకాల ఆస్తులు ఉన్నాయి.సాఫ్ట్‌వేర్ కంపెనీ విలువు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు అకౌంట్‌లో రూ.4.42 కోట్లు, నగదు రూపంలో రూ.1.15 లక్షలు ఉండగా, చరాస్తుల విలువ రూ.856.57 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ.15.70 కోట్లుగా, అప్పులు రూ.2.69 కోట్లుగా పేర్కొంది లోకం మాధవి .