
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 11న విజయవాడలో జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దయింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు రేపటి సమావేశంలో పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయాల్సి ఉంది.
కానీ పవన్ వైరల్ ఫీవర్తో బాధపడుతుండటంతో ఈ సమావేశం వాయిదా పడింది. దీంతో తదుపరి తేదీన త్వరలో ప్రకటిస్తామని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.