
సమర్థవంతమైన నాయకులు పార్టీలో లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో మాట్లాడిన ఆయన… జనసేన, నాయకుల లోపం వల్లే ఓడిపోయిందని అన్నారు. స్వార్ధం లేకుండా తాను రాజకీయాలకు వచ్చానని అన్నారు. 2014లోనే పార్టీని విలీనం చేయాలని మరో పార్టీ వాళ్లు కోరారరని… అందుకు తాను ఒప్పుకోలేదని తెలిపారు.
ఎదో ఒక రోజు… దేశం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని చెప్పారు పవన్. ఆశయాల సాధన కోసమే జనసేన ఆవిర్భవించిందని అన్నారు. అయితే తమ దగ్గర పార్టీకి కావలసిన ధనం లేదని చెప్పారు పవన్. తాను బతకడానికి మాత్రమే అవసనమైనంత మనీ ఉందని.. తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. అయితే సమాజంలో జరిగే తప్పులు తనను నిద్ర పట్టకుండా చేసేవని అన్నారు. పార్టీలోని చాలా మంది నేతలు ఎన్నికల్లో గెలిచి తనకు గిఫ్ట్ ఇస్తామని తనతో అనేవారని చెప్పారు. అయితే గిఫ్ట్ ఇవ్వడానికి రాష్ట్రం కేకు ముక్క కాదని తెలిపారు.