తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. నవంబర్ 22, 23వ తేదీల్లో పవన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నారు. జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
* బుధవారం (నవంబర్ 22) రోజు మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
* గురువారం (నవంబర్ 23న) ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, సాయంత్రం 4 గంటలకు దుబ్బాకలో ప్రచారం చేయనున్నారు.
ఎన్నికల్లో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో ఇరుపార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరఫున విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.