![మల్కాజ్ గిరి నుంచి బరిలో జనసేన అభ్యర్థి](https://static.v6velugu.com/uploads/2019/03/JANASENA.jpg)
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి జనసేన రెడీ అయ్యింది. మల్కాజ్ గిరి జనసేన లోక్ సభ అభ్యర్థిగా పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డిని బరిలో దించుతున్నట్టు పవన్ ప్రకటించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సమాజానికి సేవ చేయాలన్న తపనతో వ్యాపారాలను వదులుకొని తనతోనే మహేందర్ రెడ్డి ఉన్నారని పవన్ తెలిపారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆయనను గతంలో PRP అభ్యర్థిగా ఎంపికచేసినా.. ట్రాఫిక్ లో చిక్కుకొని నామినేషన్ వేయలేకపోయారని గుర్తుచేసుకున్నారు. ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఆయనను మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా బరిలో దించుతున్నట్టు పవన్ ప్రకటించారు.