2024 ఏపీ ఎన్నికలు రెండు సినీ కుటుంబాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. ఇన్నాళ్లు 'కొణిదెల', 'అల్లు' అంటూ ఇంటి పేర్లు వేరయినా ఉమ్మడి కుటుంబంలా ఒక్కటిగా కలిసివుండే మెగా ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి గెలుపు కోసం బన్నీ ఒకడుగు ముందుకేయడం.. ఆ తరువాత నాగబాబు అల్లు వారసుడిపై విమర్శలు చేయడం చకచకా జరిగిపోయాయి. అప్పటినుండి అల్లు, మెగా అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. తాజాగా, ఆ యుద్ధంలోకి ఓ రాజకీయ నేత ఎంట్రీ ఇచ్చారు.
నమ్మిన వాళ్ల పక్షాన నిలబడాలి
ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న అల్లు అర్జన్ తనను నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తానంటూ పరోక్షంగా నంద్యాల ఇన్సిడెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. "ఇష్టమైన వాళ్లకు మనం చూపించాలి. మనం నిలబడాలి. మన ఫ్రెండ్ అనుకో.. ఇంకొకరు అనుకో.. మనకు కావాల్సిన వాళ్ళు అనుకో. నా కిష్టమైతేనే వస్తా. నా మనసుకు నచ్చితేనే వస్తా.." అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడినట్లు కథనాలు రావడంతో జనసేన ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు వారసుడు తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించాడు.
స్థాయేంటో తెలుసుకో..
అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదన్న బొలిశెట్టి శ్రీనివాస్.. ఉన్నదల్లా చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎవరైనా షామియానా కంపెనీల్లాగా బ్రాంచ్‌లు పెట్టుకున్నారేమో తమకు తెలియదన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచారని, అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ప్రచారం చేసినా వైసీపీ అభ్యర్థి ఓడిపోయారని గుర్తుచేశారు.
ALSO READ | డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌ను కలిసిన రష్యా వ్యోమగామి
"చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీలో ఆ నటులను చూసుకుంటున్నారు అంతే. నాకు ఇష్టముంటేనే వస్తా, నిన్ను ఎవరు రమ్మన్నారు. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మేము 21 చోట్ల నిలబడితే 21 నెగ్గాం.. నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. 2009లో నరసాపురంలో మీ నాన్న అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించుకోలేకపోయారు. మీరు అందర్ని విమర్శించడం సరికాదు " అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలతో అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది.
Bolisetty Srinivas, Janasena MLA from Tadepalligudem :
— Gulte (@GulteOfficial) August 27, 2024
"అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నాకు తెలీదు.. ఉన్నది మెగా ఫ్యాన్స్.#AlluArjun కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదు. ఆయన ఉహించుకుంటున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు.
నువ్వు వస్తే ఏంటి రాకపోతే… pic.twitter.com/CkxmOQ3WeK