పార్టీ కార్యక్రమాల్లో కనిపించొద్దు: జానీ మాస్టర్ పై జనసేన ఆంక్షలు.

పార్టీ కార్యక్రమాల్లో కనిపించొద్దు: జానీ మాస్టర్ పై జనసేన ఆంక్షలు.

 ప్రముఖ టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.  ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ని కొన్ని రోజులుగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని అలాగే మతం మారి పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులు గురి చేస్తున్నట్లు.. మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటంతో.. పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న అతనిపై చర్యలు తీసుకున్నది జనసేన. జనసేన పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలంటూ జానీ మాస్టర్ ను ఆదేశించింది జనసేన పార్టీ.  ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేస్తున్నట్లు కూడా పేర్కొంది. 

ఈ విషయం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ తన విషయంలో ఇంత జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

ALSO READ | Jani Master: జానీ మాస్టర్ మంచి ఆటగాడే..ఎఫ్ఐఆర్లో ఏముందంటే..