
ప్రజా జీవితంలో తన పోరాటం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కాదని.. ప్రజా సమస్యలతో అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. జులై 13న తణుకులో ఆయన మాట్లాడుతూ.. ధైర్యం ఉన్నవారు పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్లే పారిపోయారని.. అలాంటిది జగన్ ఎంత అంటూ ఎద్దేవా చేశారు.
అడ్డగోలుగా దోచేస్తున్న వారిపై జనసేన పోరాడుతుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న అన్ని కేసుల్ని పరిష్కరిస్తామని తెలిపారు. జగన్ఓ రౌడీ పిల్లవాడని.. ఆయన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసని అన్నారు. జగన్ గిల్లాడని వెళ్లి తాము ప్రధాని మోదీ కి కంప్లెంట్ చేయబోమని.. ఇక్కడే తాడోపేడో తేల్చుకుంటామన్నారు. జగన్ అరాచకాలను ప్రజల్లోనే ఎండగడతామన్నారు.
సిద్ధాంతాలు మారడం వల్లే బీఆర్ఎస్..
తణుకులో మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నడవడికను పవన్ గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలు మారడం వల్లే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిందని ఆయన అన్నారు.