ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావుకు ఒక్క అవకాశమివ్వండి : పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌

వరంగల్‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ తూర్పు బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావుకు ఒక్క ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ కోరారు. వరంగల్‌‌‌‌‌‌‌‌లోని హంటర్‌‌‌‌‌‌‌‌ రోడ్డులో బుధవారం నిర్వహించిన ప్రచార సభలో పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు.

2009 ఎన్నికల నాటి నుంచి ఆయనను చూస్తున్నానని, అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉండే లీడర్‌‌‌‌‌‌‌‌ అని కొనియాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు.