జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.. బీజేపీ, ఎన్సీపీ సభ్యుల మధ్య తోపులాట జరగటంతో అసెంబ్లీ రణరంగంలా మారింది. ఆర్టికల్ 370పై తీర్మానానికి ఎన్సీపీ పట్టు పట్టింది. ఆర్టికల్ 370, సెక్షన్ 35ఏ ను మళ్ళీ తీసుకురావాలని డిమాండ్ చేసింది ఎన్సీపీ. ఏఐపీ నేత ఖుర్షిద్ బ్యానర్ ను ప్రదర్శించగా.. బీజేపీ నేతలు ఆ బ్యానర్ ను చించేశారు. దీంతో సభ గందరగోళంగా మారటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సభను వాయిదా వేశారు.
ఆర్టికల్ 370 తీర్మానంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారి తీయటంతో అసెంబ్లీలో యుద్దవాతావరణం నెలకొంది. సభలోని ఎమ్మెల్యేలంతా బాహాబాహీకి దిగారు. బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ ప్రారంభమైన రోజు కూడా ఈ అంశంపై గందరగోళం నెలకొంది. ఇక రెండోరోజు పరిస్థితి అదుపు తప్పటంతో సభను వాయిదా వేశారు స్పీకర్.
ఈ అంశంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయమిస్తాయని అన్నారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేయి కలిపిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.