
జనగామ అర్బన్, వెలుగు : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య సూచించారు. ఓటు నమోదు, ఓటు హక్కు ప్రాముఖ్యతపై శుక్రవారం శామీర్‌పేటలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ వినోద్‌కుమార్, ఆర్డీవో మురళీకృష్ణ, సాధిక్ అలీ, ప్రిన్సిపాల్ హరిప్రియ, వైస్ ప్రిన్సిపాల్ రజిత పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పోషణమాస వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులను గుర్తించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 30 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీడబ్ల్యూవో జయంతి, డీసీపీ సీతారాం, డీఏవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
ఫొటో సిమిలర్ ఎంట్రీలపై దృష్టి పెట్టాలి
ములుగు, వెలుగు : ఓటర్ లిస్ట్‌లో ఫొటో సిమిలర్ ఎంట్రీలపై ఆఫీసర్లు దృష్టి పెట్టాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కొత్తగూడ, గంగారం మండలాల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా ఓటర్ లిస్ట్ పరిశీలించి రిమార్కులతో కూడిన చెక్‌లిస్ట్‌ను బీఎల్‌వోలకు అందజేయాలని చెప్పారు. ఇంటింటి సర్వే చేసి రిపోర్టును రూపొందించాలని ఆదేశించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, అంతకుమించి పోలింగ్ కేంద్రాల్లో నమోదైతే ఓటరు చాయిస్ మేరకు ఏదో ఒక కేంద్రంలోనే పేరు ఉంచి, మిగతా వాటిని తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్ డీఎస్.వెంకన్న, ఆర్డీవో కె.సత్యపాల్‌రెడ్డి, ఎలక్షన్ డీటీ విజయ్‌కుమార్, ఈడీఎం దేవేందర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. రోగులకు అందుతున్న సేవల గురించి సూపరింటెండెంట్ జగదీశ్‌ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ప్రవీణ్, శ్రీపాల్, సతీశ్, సుధీర్, జి.రఘు ఉన్నారు.
ఓటర్ లిస్ట్ పక్కాగా ఉండాలి
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : ఓటర్ లిస్ట్‌పై బల్దియా హెడ్ ఆఫీస్‌లో శుక్రవారం కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ లిస్ట్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో బల్దియా సెక్రటరీ విజయలక్ష్మి, సీఎంహెచ్‌వో రాజేశ్, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం
ములుగు, వెలుగు : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్పీ గౌస్ ఆలం చెప్పారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మద్యం, మత్తుపదార్థాల రవాణాను అడ్డుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ కిరణ్, సీఐ రంజిత్‌కుమార్, శంకర్ పాల్గొన్నారు.