పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

 పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఈ ఏడాది పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అన్ని మండలాల విద్యాధికారులను, పాఠశాలల హెచ్​ఎంలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్​అన్ని మండలాల ఎంఈవోలు, హెచ్​ఎంలతో సమీక్ష నిర్వహించారు. విజయోస్తు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, స్డడీ ఆవర్స్​లో అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో సాధన చేయించాలని, వసతి గృహాల్లోని వార్డెన్లు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3న అన్ని ప్రభుత్వ పాఠశాలల పదో  తరగతి విద్యార్దులకు మాక్​టెస్ట్​నిర్వహిస్తామని తెలిపారు. ప్రజ్ఞోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మండల స్థాయిలో నృత్యమేళా, వ్యాసరచన, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు.  సమీక్షలో డీఈవో రమేశ్, జీసీడీవో గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.