జనగామ అర్బన్, వెలుగు: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలక పాత్ర అని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ పింకేశ్‌కుమార్ తో కలిసి నోడల్అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్మాట్లాడుతూ నోడల్అధికారులందరూ వారికి కేటాయించిన అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీలు పన్ను వసూళ్ల పైన దృష్టి పెట్టాలన్నారు.
నర్సరీల గురించి మాట్లాడుతూ జీపీల్లోని నర్సరీల్లో బ్యాగ్‌లలో విత్తనాలను నాటాలన్నారు. సమావేశంలో జడ్జీ సీఈవో మాధురి షా, డీఆర్డీవో వసంత, డీపీవో స్వరూప రాణి, నోడల్‌అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎడోద్వాజ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మధులాశ్బాబు నేతృత్వంలో ప్రారంభమైన ఫ్లో బస్సు కలాం స్ఫూర్తి యాత్ర జిల్లా సాంఘిక సంక్షేమ బాలుర కాలేజీకి చేరగా, కలెక్టర్‌పాల్గొని ఫ్లో బస్సులోని ఐఓటీ, ఏఆర్, వీఆర్, రోబోటిక్స్, ఏఐ, 3డీ ప్రింటింగ్వంటి 16 ఆధునిక సాంకేతికతలను తిలకించారు. కాలేజీలోని వంట గదిని, సరుకులని, టాయిలెల్స్‌ను పరిశీలించారు. వంట గదిలో వంటల తయారీ విధానంను చూసి ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.