ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి

ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి

జనగామ అర్బన్, వెలుగు: వరంగల్​-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్​ బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ రోహిత్​ సింగ్​తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పోస్టల్​బ్యాలెట్​పోలింగ్​విధానంపై సెక్టార్​అధికారులు, ప్రిసైడింగ్​అధికారులు, సహాయ ప్రిసైడింగ్​ అధికారులు, ఓపీవోలకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12 పోలింగ్​ కేంద్రాలకు 1,002 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

పోలింగ్​ నిర్వహణకు 17 మంది పీవోలు, 18 మంది ఏపీవోలు, 37 మంది ఓపీవోలు, 18 మంది మైక్రో అబ్జర్వర్లకు విధులు కేటాయించామన్నారు. ఈ నెల 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో సంబంధిత రూట్ల ద్వారానే పోలింగ్​ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. అంతకుముందు పోలింగ్​విధుల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లు పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. అంతకుముందు కలెక్టర్​ జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్​ స్కూల్​లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమంలో పాల్గొని, పలు సూచనలు చేశారు.