
జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, ట్రాకింగ్సిస్టం ఉండాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. యాసంగి 2024-25 కి సంబంధించి ధాన్యం కొనుగోలు పై శనివారం అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగికి సంబంధించి జిల్లాలో 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 2,35,954 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జిల్లాలో 300 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు ప్రక్రియ అయిపోయి మిల్లులకి పోయేంతవరకు ప్రతి నిర్వహకులు ట్రాకింట్ సిస్టమ్‌ను మెయింటైన్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో గోపిరాం, డీఆర్డీవో వసంత, డీఎం సివిల్ సప్లై హతీరామ్, డీఏవో రామారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్స్కూల్, ధర్మకంచ జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించారు.