జనగామ అర్బన్, వెలుగు : జిల్లాలోని అన్ని స్కూళ్లను ప్రత్యేకాధికారులు సందర్శించి, పర్యవేక్షించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు పింకేశ్కుమార్, రోహిత్సింగ్తో కలిసి మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన నాలుగు సంక్షేమ పథకాల కోసం చేపట్టిన పరిశీలన, డేటా ఆన్లైన్నమోదు, గ్రామ, వార్డు సభల నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేసి, విజయవంతం చేసిన జిల్లా, మండల స్థాయి అధికారులందరికీ అభినందనలు తెలిపారు.
సంక్షేమ పథకాల ప్రజావాణి ప్రత్యేక కౌంటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు సందర్శించి పర్యవేక్షించాలని, ఆహార నాణ్యత, పదవ తరగతి ప్రత్యేక తరగతులు, తదితర అంశాలను తనిఖీ చేయాలని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గోపిరాం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.