పాత పెన్షన్ సాధనకు ఉద్యమిస్తాం

జనగామ అర్బన్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని ఓపీఎస్ మినహా మరే ప్రత్యామ్నాయాలకు అంగీకరించేది లేదని, తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ జనగామ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ హెచ్చరించారు. సెప్టెంబర్​1న జరిపే పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జనగామ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆదివారం నిర్వహించిన నిరసనలో ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువస్తున్న యూపీఎస్​ విధానాన్ని వ్యతిరేకించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్, చంద్రశేఖర్​ రావు, మహిపాల్​రెడ్డి, లక్ష్మయ్య, లక్ష్మణమూర్తి, రాజు, తదితరులు పాల్గొన్నారు.