జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సైపై బదిలీ వేటు

జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సైపై బదిలీ వేటు

జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సై పై బదిలీ వేటు పడింది.  గిరిజన యువకుడు పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని మరణించడంతో పాలకుర్తి ఎస్సై మోడం సాయి ప్రసన్న కుమార్ ను  వరంగల్ సిసిఎస్ కు బదిలీ  చేశారు.  సస్పెండ్ చేయాలని మృతుడు, బంధువులు, గిరిజన సంఘాలు డిమాండ్ చేయగా బదిలీ చేశారు. పాలకుర్తి ఎస్సైగా డి పవన్ కుమార్ నియమించారు.

ALSO READ | పీఎస్‌‌‌‌ ముందు పెట్రోల్‌‌‌‌ పోసుకున్న యువకుడు

 

అక్టోబర్ 18న పాలకుర్తి పీఎస్ లో  పెట్రోల్‌‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన మేకలతండాకు చెందిన శ్రీను (21) వరంగల్‌‌ ఎంజీఎంలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ అక్టోబర్ 19న ఉదయం చనిపోయాడు. దీంతో మృతుడి బంధువులు, తండావాసులు  పాలకుర్తి పోలీస్‌‌స్టేషన్‌‌ను ముట్టడించారు. శ్రీను మృతికి కారణమైన వారిని అరెస్ట్‌‌ చేయాలని, ఎస్సై, సీఐలను సస్పెండ్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేశారు.