
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లులో నేటి నుంచి 16వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పోటీల నిర్వహణ కోసం మూడు కబడ్డీ కోర్టులు సిద్ధం చేయడంతో పాటు క్రీడాకారులకు భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఇప్పటివరకు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి 65 టీంలు పేర్లు నమోదు చేసుకున్నాయి.
ఫస్ట్ ప్రైజ్ కింద రూ. 60 వేలు, సెకండ్ ప్రైజ్ రూ. 40 వేలు, థర్డ్ ప్రైజ్‌గా రూ. 30వేలు ఇవ్వడంతో పాటు, మరో మూడు నగదు బహుమతులు అందజేయనున్నట్లు జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి చెప్పారు. 99668 68076, 97019 49689 నంబర్లకు ఫోన్ చేసి టీంలు పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.