ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి 

ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి 

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: నీతి, నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి డిమాండ్​ చేశారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్‌‌లో  వచ్చే ఏప్రిల్​27న జరిగే బీఆర్​ఎస్​ రజతోత్సవ సభ విజయవంతానికి బుధవారం బీఆర్​ఎస్​ మండల సన్నాహక సమావేశం జరిగింది.

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడుతూ బీఆర్​ఎస్​ కార్యకర్తలు త్యాగాల ఫలితంగానే కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే  పదవులను అనుభవించారని చెప్పారు. కడియం రాజీనామా చేసేంత వరకు బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఊరుకునేదిలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ జడ్పీ చైర్మన్​ రవి తదితరులు పాల్గొన్నారు.