పన్ను కట్టేంత వరకు కదలం.. ఇంటి ముందు బైఠాయించిన జనగామ మున్సిపల్​ అధికారులు

పన్ను కట్టేంత వరకు కదలం.. ఇంటి ముందు బైఠాయించిన జనగామ మున్సిపల్​ అధికారులు

జనగామ, వెలుగు: జనగామ మున్సిపాలిటీ​పరిధిలో మొండి బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంటి, నల్లా పన్నుల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని బతుకమ్మకుంటలోని ఓ ఇంటి ముందు శనివారం కమిషనర్​ వెంకటేశ్వర్లు, మున్సిపల్​ అధికారులతో కలిసి బైఠాయించారు.

 ఆరేండ్లుగా ఇంటి పన్ను చెల్లించడం లేదని, పలుమార్లు చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదని కమిషనర్​ తెలిపారు. పన్ను చెల్లించేంత వరకు కదిలేది లేదంటూ అక్కడే కూర్చోవడంతో రూ.7,500 చెల్లించాడని, మిగిలిన బకాయి చెల్లించేందుకు వారం రోజుల గడువు అడిగినట్లు తెలిపారు. మేనేజర్​ రాములు, ఆర్వో బాబు, ఆర్ఐ ఏలియా, మధు ఉన్నారు.