జనగామ జిల్లాలో నుజ్జునుజ్జయిన ఆటో.. స్పాట్లోనే ఆటోలోని మనిషి ప్రాణం పోయింది..

జనగామ జిల్లాలో నుజ్జునుజ్జయిన ఆటో.. స్పాట్లోనే ఆటోలోని మనిషి ప్రాణం పోయింది..

వరంగల్: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జయింది. చనిపోయిన వ్యక్తి సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం రెడ్య నాయక్ తండాకు చెందిన విజయ్ నాయక్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.

ALSO READ | గచ్చిబౌలిలో కాల్పుల ఘటన.. దండుపాళ్యం గ్యాంగ్ కంటే డేంజర్గా ఉన్నాడుగా..!

జనవరి 9న కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, తుఫాన్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండా దగ్గర జనగామ-సూర్యపేట ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. జనగామ సూర్యాపేట హైవేపై  గురువారం ( జనవరి 9, 2025 ) అర్ధరాత్రి డీసీఎం, తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.  చనిపోయిన వారు సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందినవారని.. మృతులు పేరాల జ్యోతి,పేరాల వెంకన్న భార్యాభర్తలుగా పోలీసులు గుర్తించారు.