ఇటీవలే తెలుగులో ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం ట్రైలర్ విదలయిన సంగతి తెలిసిందే. కాగా దేవర చిత్ర ట్రైలర్ విడుదలయిన ఒక్క రోజులోనే దాదాపుగా 55 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి.
అయితే దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ తాజాగా ట్రైలర్ విడుదలపై స్పందించింది. ఇందులో భాగంగా తనకి తెలుగులో ఇది మొదటి చిత్రమని అలాగే దేవర చిత్రంలో నటించిన తర్వాత తన సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలిగిందని పేర్కొంది. అంతేగాకుండా దేవర చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆశించింది. ఇక ఎన్టీఆర్ తో కలసి నటించిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నానని మరియు తాను ఎన్టీఆర్ కి పెద్ద అభిమానినని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్రం ఈ నెల 27వ తారీఖున భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ ప్రీ బుకింగ్ టికెట్లు విడుదల చేయడంతో ప్రీమియర్ షోస్ పడకముందే రూ.8.3 కోట్లు కలెక్ట్ చేసింది.