బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.పుట్టిన రోజు, పండగలు, పర్వదినాలు ఇంకా పలు ప్రత్యేక సందర్భాల్లో ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జాన్వీకి చాలా ఇష్టం.ప్రస్తుతం తన పుట్టిన రోజు (మార్చి 6) సందర్బంగా జాన్వీ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది.ఈ తిరుమల యాత్రకు సంబంధించిన విశేషాలను తన ఫ్రెండ్ ఒరీ ఒక వీడియో ద్వారా వెల్లడించాడు.
వివరాల్లోకి వెళితే..జాన్వీ కపూర్ తన ఫ్రెండ్స్ శిఖర్ పహారియా, ఒరీతో కలిసి ఆమె తిరుమల వెళ్లారు. 'చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో స్టార్ట్ అయి తమకు తిరుపతికి చేరుకునేందుకు దాదాపు మూడు గంటలు పట్టిందని..ఇక అక్కడి నుంచి జాన్వీ కపూర్ తమ ఫ్యామిలీ మెంబర్స్, రెలెటివ్స్,ఫ్రెండ్స్ తో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామన్నారు.
అయితే..ఇక్కడ విశేషమేంటంటే..మోకాళ్ల మిట్ట దగ్గరకు వచ్చాక జాన్వీ మరియు శిఖర్ మోకాళ్లపై తిరుమల గుడి మెట్లెక్కినట్లు ఓరీ ఈ వీడియోలో చెప్పాడు.అంతేకాకుండా జాన్వీ ఇప్పటివరకు సుమారు 50 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుందని" కూడా ఓరీ వెల్లడించడం విశేషం.
తిరుమల చేరుకున్న జాన్వీకి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ బ్రేక్ దర్శనం సమయంలో జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేసింది. రంగనాయకుల మండపంలో..వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అంద చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.