జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ ‘గుడ్‌లక్ జెర్రీ’. సీరియస్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె జయకుమారిగా కనిపించనుంది. సిద్దార్థ్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ్ లో 'లేడీ సూపర్‌స్టార్' నయనతార నటించిన ‘కోలమావు కోకిల’కు రీమేక్. జులై 29 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలాగోలా నెట్టుకొస్తున్న జెర్రీ(అలియాస్ జయ కుమారి) తల్లికి క్యాన్సర్ అన్న విషయం తెలుస్తోంది. అమ్మ అపరేషన్ కోసం , చెల్లి చదువు కోసం జెర్రీ డ్రగ్స్ స్మగ్లింగ్ లోకి చేరడం. ఆ తరువాత పోలీసులు, గుండాల కళ్లు కప్పి భారీగా డబ్బు సొంతం చేసుకోవడం వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ను కట్ చేశారు. దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్ , సుశాంత్ సింగ్ కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ సుభాస్కరన్‌తో కలిసి ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.