Janhvi Kapoor: ఓ మై గాడ్.. లవ్ యూ సరాఫ్: కో స్టార్ నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్ అందుకున్న జాన్వీ

Janhvi Kapoor: ఓ మై గాడ్.. లవ్ యూ సరాఫ్:  కో స్టార్ నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్ అందుకున్న జాన్వీ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) స్పెషల్ గిప్ట్ అందుకుంది. నేడు (మార్చి 6, 2025న) తన 28వ పుట్టినరోజు సందర్భంగా తన కో స్టార్ రోహిత్ సరాఫ్ (Rohit Saraf ) నుండి బ్యూటిఫుల్ బహుమతిని అందుకుంది.

ఈ నేపథ్యంలో రోహిత్ పంపించిన గిఫ్టును తన ఇంస్టాగ్రామ్లో జాన్వీ షేర్ చేస్తూ 'ఓ మై గాడ్.. మధురమైన బహుమతి.. లవ్ యూ సరాఫ్' అంటూ ట్యాగ్ ఇచ్చింది. రోహిత్ సరాఫ్ పంపిన బహుమతి చూస్తే.. 'ఒక పెట్టె లోపల కుక్క నేపథ్యంతో కూడిన బర్త్డే కేక్ ఉంచబడింది. ఈ కేక్ చాక్లెట్ ఫ్రాస్టింగ్‌తో, మెత్తటి గోధుమ రంగు కుక్క ముఖంలా కనిపించేలా రూపొందించబడింది' అలాగే ఆ కేక్ బేస్ మీద "హ్యాపీ బర్త్ డే JK!" అనే ట్యాగ్ ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. 

న‌టుడు వ‌రుణ్ ధావ‌న్, రోహిత్ సరాఫ్ తో క‌లిసి `స‌న్నీ సంస్కారీకి తుల‌సి కుమారీ` అనే సినిమాలో జాన్వీ నటిస్తోంది. శ‌శాంక్ కైతాన్ ఈ చిత్రాన్నిడైరెక్ట్ చేస్తున్నాడు. స్వ‌చ్ఛ‌మైన ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో రూపొందిస్తున్నాడు. ధ‌డ‌క్ త‌ర్వాత జాన్వీ న‌టిస్తోన్న ల‌వ్ స్టోరీ కూడా ఇదే.