మధురానగర్​లో జాన్వీ పూజలు

మధురానగర్​లో జాన్వీ పూజలు

వెలుగు, జూబ్లీహిల్స్: సినీ హీరోయిన్ జాన్వీకపూర్ గురువారం సిటీలో తళుక్కుమన్నారు. ఉదయాన్నే మధురానగర్​లోని అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ ​వచ్చినట్లు జాన్వీ తెలిపింది.

ఆమె వెంట ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.  జాన్వీకపూర్​వచ్చినట్లు తెలుసుకున్న అభిమానులు, స్థానికులు ఆమెను చూసేందుకు తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.