బాలీవుడ్ సుందరి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎట్టకేలకు తన ప్రేమ వ్యవహారంపై స్పందించింది. తనకు గతంలో ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడని తెలిపింది. తరచూ అతడిని కలవడానికి రహస్యంగా వెళ్లేదాన్నని..ఈ విషయం ఇంట్లో తెలిసి తనపై రెస్ట్రిక్షన్స్ పెట్టారని జాన్వీ వివరించింది.
అయితే, తన తల్లికి ఈ ప్రేమ వ్యవహారం నచ్చలేదని..అందుకే అతడికి బ్రేకప్ చెప్పినట్టు వివరించింది. రిలేషన్లో ఉండటం వల్ల తన పేరెంట్స్‌తో నిజాయితీగా ఉండలేకపోయానని గుర్తుచేసుకుంది. ఎప్పుడూ అబద్దాల మధ్య బతకాల్సి రావడం నచ్చలేదు. అమ్మానాన్నలతో ఓపెన్‌గా ఉన్నప్పుడే మన నిర్ణయాలపై వారికి నమ్మకం కలుగుతుంది. ఆ విషయం అర్థమయ్యాక అతడిని దూరం పెట్టేశాను’ అంటూ జాన్వీ కపూర్ వెల్లడించింది. ఇక ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ ప్రత్యేక పూజలు నిర్వహించింది.
జాన్వీ తెలుగులో Jr NTR సరసన ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకుడు.