Janhvi Kapoor: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన జాన్వీ కపూర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన దేవర (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‎లోని నోవాటెల్ హోటల్‎లో ఆదివారం (సెప్టెంబర్ 22న) జరగాల్సిన వేడుకకు 20 వేల మందికి పైగా అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో సెక్యూరిటీ చేతులేత్తేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా డిస్సపాయింట్ అయ్యారు. అభిమానుల ఆకలిని అర్ధం చేసుకున్న ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేసి ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో తాజాగా దేవర మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేసింది. " అందరికి నమస్కారం. ముందుగా నన్ను ఇంతలా తెలుగు ఇండస్ట్రీకి స్వాగతించి, నా మీద ఇంత ప్రేమ చూపించిన తెలుగు ఆడియన్స్, నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికి నా ధన్యవాదాలు.

మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీల్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ శ్రీదేవి మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను.

దేవర మూవీ నా మొదటి అడుగు. డైరెక్టర్ శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఈ మూవీకి హీరోయిన్ గా ఎంచుకోవడం నా అదృష్టం. మా ప్రయత్నం మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. దేవర టీమ్ అందరికి ధన్యవాదాలు.. 

Also Read:- దేవిశ్రీ పాటకి మోదీ ఫిదా.. 

అయితే.. "నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదాము అనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో జాన్వీ వీడియో వైరల్గా మారింది. జాన్వీ కపూర్‌ అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. 

కాగా, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే.