పోలీసుల చార్జిషీట్ పై స్పందించారు కొరియోగ్రాఫర్ జానీ. లైంగిక వేధింపుల కేసులో తాను నిందితుడిని మాత్రమేనని...ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కోర్టుపై తనకు గౌరవం ఉందన్న జానీ..నిర్దోషిగా బయటకు వస్తానని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏం జరిగిందో తన మనసుకు..తన అంతరాత్మకు..ఆ దేవుడికి మాత్రమే తెలుసన్నారు. న్యాయ స్థానంలో క్లీన్ చీట్ తో బయటకు వస్తా.. అప్పుడే అన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు. తనకు హార్డ్ వర్క్ చేయడం..ఫ్యాన్స్ ను అలరించడమే తన పని అన్నారు. అభిమానుల ప్రేమతోనే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు.
కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. ఈవెంట్స్ పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు జానీపై పై ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Also Read : సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
కొరియోగ్రాఫర్ జానీ.. అలియాస్ షేక్ జానీ భాషాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్ జానీ అత్యాచారంతో పాటు తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని అసిస్టెంట్ డ్యాన్సర్ ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. దీనిపై జానీ జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు.