కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం మరియు లైంగిక వేధింపులకి పాల్పడినట్లు జానీ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెయ్యగా వారు నార్సింగి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేసారు.
అయితే కేసు వ్యవహారం మొదలైన తర్వాత కొరియోగ్రాఫర్ జానీ పరారీలో ఉండగా ఇటీవలే పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల విచారణలో జానీ మాట్లాడుతూ తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కొందరు కావాలనే తనపై తప్పుడు కేసు బనాయించినట్లు చెప్పాడు.
అంతేగాకుండా లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటికి వస్తానని అలాగే తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. దీంతో కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారం మరింత హీట్ ఎక్కింది.
ఈ విషయం ఇలా ఉండగా లైంగిక వేధింపులు మరియు అత్యాచార వ్యవహారంలో కొరియోగ్రాఫర్ జానీ భార్య సుమలతపై కూడా ఆరోపణలు రావడంతో నార్సింగి పోలీసులు ఆమెను కూడా విచారించారు. జానీ మాస్టర్ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది.