Jani Master: రామ్ చ​రణ్​,ఉపాసన అండగా నిలబడతామన్నారు..మెగా ఫ్యామిలీపై జానీ మాస్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌

Jani Master: రామ్ చ​రణ్​,ఉపాసన అండగా నిలబడతామన్నారు..మెగా ఫ్యామిలీపై జానీ మాస్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌

తెలుగు,తమిళ ఇండస్ట్రీస్ నుండి ఇప్పటికే చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ హీరోలుగా చేశారు. అందులో కొంతమంది సక్సెస్ అవగా..మరికొందరు మల్లి డాన్స్ కొరియోగ్రాపీ చేసుకుంటున్నారు. అయితే, జానీ మాస్టర్ మాత్రం ఓ వైపు పెద్ద, చిన్న, భాష భేదం అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో సాంగ్స్ కి కొరియోగ్రాపీ చేస్తున్నారు. 

తాజా విషయానికి వస్తే..తన పుట్టినరోజు తరువాతి రోజే జానీ మాస్టర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.జానీ మాస్టర్ మంగళవారం (జూలై 2న) పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ మేరకు సెలబ్రెటీల నుంచి ఆయనకు బర్త్ డే విషెష్లు కూడా వెల్లువలా కురిశాయి. అయితే  తాజాగా జానీ మాస్టర్ ట్వీట్ చేస్తూ సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడని అన్నారు. జానీ మాస్టర్ మాటల్లోనే..

"సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న,ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టి కృతజ్ఞత భావాన్ని నిలుపుకున్నాడు.మెగా ఫ్యామిలీ అంటే జానీ మాస్ట‌ర్ కి ఎంతలా అభిమానమో అందరికీ తెలిసిందే. 

ప్రస్తుతం జానీ మాస్టర్ హీరోగా చేస్తున్న మూవీ "రన్నర్". దర్శకుడు విజయ్ చౌదరి(Vijay Chowdary) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jani Master (@alwaysjani)